Monday, November 17, 2025

మహిళా డైరీ సహకార సంఘాల ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి – మేనేజింగ్ డైరెక్టర్ I.R.S కె. మురళీధర్

TEJANEWSTV :

ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కె. మురళీధర్ I R S , తేదీ  ; 27 – 10 – 2025 యన్టీఆర్ జిల్ల నందిగామ డివిజన్ పరిధి లో ఉండే పాల కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఈ పర్యటనలో భాగంగా ముందుగా యన్టీఆర్ జిల్ల వీర్లుపాడు మండలం లోని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించిన పిదప నందిగామ పశువర్ధక శాఖ డివిజనల్ ఆఫీసు మీటింగ్ హాల్ నందు మహిళా పాడి రైతులతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశమునకు వారితోపాటు అదే సంస్థలో పని చేయుచున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  డాక్టర్. కేవీ. రమణ  మరియు డిప్యూటీ డైరెక్టర్ . శ్రీ వెంకట సిద్ధులు  మరియు శ్రీ రవి పాల్గొన్నారు. జిల్లా లో మహిళా డైరీ సహకార సంఘాలను ఏర్పాటు చేయుటకు  ఒక సహాయ సంచాలకుల వారిని మరియు ఒక వెటర్నరీ డాక్టర్ను నియమించడం వలన ఇప్పటివరకు ఈ నందిగామ పరిధిలో 12 గ్రామాల లో  మహిళా డైరీ పాల కేంద్రాలను  ఏర్పాటు చేయడం జరిగింది.
సదరు మహిళా డైరీ సహకార  సంఘాలకు మేనేజింగ్ డైరెక్టర్ వారు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు సంఘ సభ్యులకు అందజేయడం జరిగినది.
మరియు ఈ సమావేశము నందు మాట్లాడుతూ ప్రతి గ్రామం లో మహిళా డైరీ సహకార సంఘాలను ఏర్పాటు చేసి తధనుగుణంగా పాల ఉత్పత్తిని పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవలసినదిగా మహిళా సంఘాలను కోరారు. సదరు మహిళా డైరీ సహకార సంఘాలకు కావలసిన తోడ్పాటు ప్రభుత్వం తరఫున  అందించేందుకు సిద్ధంగా   ఉన్నట్లు వారు తెలిపారు.
ఈ మహిళా డైరీ సహకార సంఘాలకు కావలసిన పాడి గేదెల రుణాలను కే.డి.సి.సి. బ్యాంకు ద్వారా గాని లేదా ఇతర బ్యాంకుల ద్వారా గాని అందించే అందించుటకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత చందర్లపాడు మండలంలోని తోటరావులపాడు గ్రామంలో నిర్మించిన బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ బిల్డింగును సందర్శించి దాన్ని పూర్తిస్థాయిలో ఆధునికరించి తద్వారా పాల  సేకరణకు సంబంధించిన పూర్తిస్థాయి ఏర్పాట్లను త్వరలోనే చేపడుతున్నామని తెలిపారు.
అందుకు తోటరావులపాడు గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరియు పర్యటనలో భాగంగా మేనేజింగ్ డైరెక్టర్ వారు సమీపంలో ఉన్నటువంటి తుర్లపాడు గ్రామం లో పాల కేంద్రాన్ని సందర్శించి అక్కడ సేకరిస్తున్న పాల శీతలీకరణ విధానాన్ని మరియు సదరు పాలు సేకరించే మిల్క్ కార్యదర్శికి తగు  సూచనలు ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా జిల్లా లోని ప్రతి గ్రామం లో పాల సేకరణ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లి మహిళా డైరీ సహకార సంఘాలను బలోపేతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమం లో  పశుసంవర్ధక శాఖ అధికారులు. డి.డి. డాక్టర్. మోజెస్ వెస్లీ, పశుసంవర్ధక శాఖ డివిజనల్ ఆఫీసర్ నందిగామ వారు, డాక్టర్ . కృష్ణమూర్తి , సహాయ సంచాలకులు నందిగామ,
డాక్టర్. ఉదయ్ శంకర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ,వత్సవాయి, డాక్టర్. నీరజ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, తోటరావుల పాడు వారు మరియు పశుసంవర్థక సహాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular