జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో సంగెం మండలం లోని వంజరపల్లి గ్రామంలో కావేరి గ్రామైక సంఘం సభ్యులకు మహిళా చట్టాల పై మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.బాల కార్మికులు లేకుండా చూడాలి, బాల్య వివాహాలు 18 సంవత్సరాల పైబడిన వారికి పెండ్లి చేయాలి, అంగన్వాడి సేవలు, అనాధ పిల్లలు ఉంటే 1098 కాల్ సెంటర్ పై ఫోన్ చేయండి,మహిళలకు సంబంధించిన ప్రభుత్వం అందించే ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా సాధికారత కేంద్రం కో ఆర్డినేటర్ పావని మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ యొక్క సర్వీసులను మరియు సైబర్ క్రైమ్ల నుండి ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించడం జరిగింది .జెండర్ స్పెషలిస్ట్ హర్షిత మాట్లాడుతూ మహిళల యొక్క స్వయం ఉపాధి అవకాశాలు మరియు నైపుణ్యాభివృద్ధి శిక్షణల గురించి తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో సెర్ప్ సిసి బొజ్జ.సురేశ్, ప్రైమరీ స్కూల్ టీచర్ రామకృష్ణ, పంచాయతీ సెక్రటరీ సతీష్,విఓఏ జెండ వాణి, మహిళా సంఘం అధ్యక్షురాలు వసంత, కార్యదర్శి సంధ్య, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.
మహిళల నైపుణ్యాభివృద్ధి మహిళా చట్టాలపై అవగాహన సదస్సు ;సెర్ప్ సి సి, బొజ్జ సురేష్
RELATED ARTICLES