Tuesday, December 9, 2025

మహిళలు ఆర్థికంగా అభివృద్ధిగా ఎదగడంమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం – సంగెం ఏపీఎం కిషన్

తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం


సంగెం మండలం , కాట్రపల్లి గ్రామంలో బుధవారం రోజు ఇందిరా మహిళ శక్తి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు నిర్వహించిన కళాజత పలువురిని ఆకట్టుకుంది. అనంతరం ఏపీఎం మాట్లాడుతూ…మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వడ్డీ లేని రుణాలు అందజేసి వ్యాపార రంగాల్లో రాణించే విధంగా ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. పాల డెయిరీ నిర్వహణ, సోలార్ ప్లాంటుల నిర్వహణ, మహిళ శక్తి క్యాంటీన్లు ఏర్పాటు,పెట్రోల్ బంకు ల ఏర్పాటు, సంచార చేపల వాహనాలు,కుటీర పరిశ్రమలు ఏర్పాటు వీ హబ్ ద్వారా నైపుణ్య శిక్షణ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో స్థానిక యువత ఉద్యోగాలు సాధించడానికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధునాతన కుట్టు మిషన్లు అందజేసి, మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రాష్ట ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలు రాణిస్తున్న మహిళా సంఘాల సభ్యులను సన్మానించారు. కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షుడు చొల్లెటి.మాధవ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెట్టుపల్లి రమేష్, శాంతి మండల సమైక్య అధ్యక్షురాలు గాయపు ఉమాదేవి,cc లు కృష్ణమూర్తి, ఏలీయా వివో ఏలు ప్రభాకర్ విజయ సుమతి కృష్ణవేణి రజిత టిఎస్ఎస్ టీమ్ లీడర్ జూపాక శివ, రామంచ భరత్, అంకం రామనాథం, మరముల్ల ఆనందం, హింగే అరవింద్ కుమార్,  ఏలబోయిన రాజు, శాలిని, అనిత, హరిత, శ్రీలత, విజయ, సీసీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular