శాంతి మండల సమైక్య సంగెం, గ్రామీణ పేదరిక నిర్మూల సంస్థ, డిఆర్డిఏ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమానికి మాట్లాడుతూ మహిళలందరూ చిన్న, పెద్ద వ్యాపారాలు చేసి అనేకమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని పొదుపు ద్వారానే పురోగతి సాధించాలన్నారు. స్వయం సహాయక సంఘ సభ్యులు సెర్ప్ సిబ్బంది సలహాలు సూచనబతో ఆదయ అభివృద్ధి పెంపొందించడం అభినందనీయమని కొనియాడారు. మహిళా అభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు చేస్తున్న రాయితీ రుణాలు, వడ్డీ లేని రుణాలు పొదుపుతో మహిళా ఆర్థిక,, సామాజికంగా రాజకీయంగా బలోపేతం కావాలి. ఆడ,మగ పిల్లలు సమానం. మహిళా సాధికారిక సాధించాలి. మహిళల్లో పెట్టుబడి పెట్టండి పురోగతిని వేగవంతం చేయండి అన్నారు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి కి పాలాభిషేకం చేయడం జరిగింది. అనంతరం వివిధ గ్రామాల్లో సేవలందించిన గ్రామ సంఘాల్లో పనిచేసిన సహాయకులకు, గ్రామ సంఘాలకు, బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంగెం మెటీపల్లి మల్లయ్య, యు బి ఐ మేనేజర్ అనిల్, కార్యదర్శి రాజమణి, కోశాధికారి రేణుక, మాజీ సెర్ప్ సిబ్బంది, సంధ్యారాణి, మాజీ అధ్యక్షురాలు ఉమారాణి, ఏపీఎం డి కిషన్, సిబిఓ ఆడిటర్ సంపత్, సీసీలు స్వరూప రాణి, రాజయ్య, కుమారస్వామి, సురేశ్, ఏలియా, కృష్ణమూర్తి,,సెర్ప్ సిబ్బంది, సుజాత కృష్ణ వివిధ గ్రామాల అధ్యక్షురాలు, వివోఏలు మహిళా సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి -ఎంపీపీ కందగట్ల కళావతినరహరి
RELATED ARTICLES