తేజ న్యూస్ టివి ప్రతినిధి
మహారాష్ట్ర చంద్రపూర్ నియోజకవర్గం సోమవారం
రోజు చంద్రపూర్ నియోజకవర్గం లోని రాజీవ్ గాంధీ చౌక్ లో జరిగిన భారీ ర్యాలీ లో ముఖ్య అతిధిగా చంద్రపూర్ నియోజకవర్గ అబ్జర్వర్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ పాల్గొనడం జరిగింది. కాంగ్రేస్ పార్టీ చంద్రాపూర్ నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశంలో డాక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. వారితో పార్టీ అభ్యర్థి విజయవకాశాల పై తగు సలహాలు సూచనలు ఇచ్చారు. నియోజకవర్గం లోని పలు ఏరియాల లో, కలియాతిరుగుతూ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ ని గెలిపించాలను ప్రజలను కోరారు.20వ తారీకు జరిగే ఎలక్షన్లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్తి ప్రవీణ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని రామకృష్ణ కోరారు.
అనంతరం పలు డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ తో కలిసి ప్రచారం నిర్వహించారు. చంద్రపూర్ నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు కలిగిన బుద్ధిష్టులు క్రైస్తవులు ముస్లింలు మాడీలు తదితర అన్ని వర్గాలు పూర్తి సహకారాన్ని అందిస్తున్నందుకు అబ్జర్వర్ డాక్టర్ రామకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు.
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహా శక్తిగా డాక్టర్ ,పెరుమాండ్ల రామకృష్ణ
RELATED ARTICLES