TEJA NEWS TV :
22-04-2024
ఆకతాయిలకు 07 రోజులు జైలు శిక్ష…..
మహానంది పోలీసు స్టేషన్ పరిదిలో తమడపల్లి టర్నింగ్ వద్ద మహానంది పోలీసులు గస్తీ తిరుగుతుండగా పబ్లిక్ రోడ్డులో ముగ్గురు వ్యక్తులు మద్యం తాగి రోడ్డుపైన వచ్చిపోయే వ్యక్తులను చూస్తూ ఈలలు కేకలు వేస్తూ, పాటలు పాడుతూ , అసభ్య పదజాలంతో దూషించు, ప్రజలకు అసహ్యం కలుగులాగున ప్రవర్తిస్తూ, శాంతిభద్రతలకు భంగం కలిగే విదంగా న్యూసెన్స్ చేస్తూ ఉండగా వారి నివాస స్థలము గురించి విచారించి సదరు ముగ్గురు వ్యక్తులను స్వాధీనంలోనికి తీసుకొని స్పెషల్ రిపోర్ట్ ద్వారా మహానంది SHO గారి వద్ద పోలీస్ స్టేషన్ నందు హాజరు పరచగా సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసి కోర్టు నందు చార్జి షీట్ దాఖలు చేసి గౌరవ నంద్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ R. రామభూపాల్ రెడ్డి గారి ముందు హాజరుపరచగా సదరు గౌరవ జడ్జి గారు ముగ్గురు ముద్దాయిలకు ఒకొక్కరికి 07 రోజులు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS గారు మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఎవరైనా మహిళలను కించపరిచే విధంగా వారి గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన ,బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన, శాంతిభద్రతల విషయంలో ఆటంకం కలిగించిన అట్టి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టుబడిన వ్యక్తి వివరాలు…
1).గుండా.మధు 26 సంవత్సరాలు S/o జి.పుల్లయ్య యూ.బొల్లవరం మహానంది మండలం
07 రోజులు జైలు శిక్ష
2).జమాన్.మధు 21 సంవత్సరాలు S /o వెంకటరమణ పలుకూరు గ్రామం,నందవరం మండలం
07 రోజులు జైలు శిక్ష
3).బత్తిని.అశోక్ 24 సంవత్సరాలు S /o లేట్ శ్రీనివాసులు తమడపల్లి గ్రామం,మహానంది మండలం
07 రోజులు జైలు శిక్ష
మహానంది: న్యూసెన్స్ కేసులో ముగ్గురికి జైలు శిక్ష
RELATED ARTICLES