ధన, నమ, ప్రాణాలు సైతం లెక్కచేయక పేద ప్రజల చైతన్యానికి విద్యనే సరైన మార్గమని చెప్పిన తన భర్త అయినా జ్యోతిరావు బాపూలే జ్ఞోదయంతో స్ఫూర్తి పొంది కాలయాపన చేయక జీవితాంతం విద్యాబోధనతో బతికిన తల్లి సావిత్రి బాయి పులే అని రాజునీతి శాస్త్ర ఆచార్యులు డాక్టర్ బట్టు విట్టల్ ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు పేట్ మండల్ ముదిరాజ్కొనియాడారు.
అమ్మ జ్ఞానం లేనిదే సృష్టిలో విజ్ఞాన పొందలేమని చెప్పిన మాతృమూర్తి సావిత్రి బాయి పూలే జీవితమే నిదర్శమనివివరించారు.
సావిత్రి బాయి పూలే అమ్మ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కామారెడ్డిలో నిర్వహించిన సమావేశంలో రాజనీతి శాస్త్ర ఆచార్యులు డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ మాట్లాడుతూ”అక్షరమే తెలియని అమ్మ జ్ఞానాక్షరమై మార్పు చెంది.. అమృత సమానమైన అక్షర జ్ఞానాన్ని నిరుపేద జాతులకు అందించిన అమ్మ సావిత్రిబాయి పూలే జ్ఞాన సరస్వతి అవతారమే అని ఆయన పేర్కొన్నారు .
మహోన్నత వ్యక్తత్వాన్ని మనుషులకు పంచిన తీరు ఓ అద్భుతమైన జీవన శైలికి, నిజమైన మానవ జన్మకు జీవన మార్గం చూపిన మహాతల్లి సావిత్రి బాయి పూలే అని శ్లాఘించారు. అందుకే త్యాగాలకు ముందుడేది “ఆమ్మ”లే అనడానికి నిదర్శనం సావిత్రి బాయి పూలే జీవితమే నిలువెత్తు సాక్ష్యం అని కొనియాడారు.
మహనీయుల జయంతులు .. వర్దంతులే కాదు .. వారు ఎంచుకున్న జీవన మార్గాన్ని భవిష్యత్ తరాలు అనుసరించి సర్వ మానవ సమానత్వం సాధించాలనే లక్ష్యంగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. “అ”అనే అమ్మ అక్షరంతో మొదలయ్యే ఈ జీవిత అక్షరాలు అనేక అద్భుతాల ను సృష్టించవచ్చని ఆయన గుర్తు చేశారు.
భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే, జీవిత కాల ప్రయానాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
నేడు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగి మానవ జీవనానికి నూతన లక్ష్యాలను నిర్దేశిస్తూ అనేక అద్భుతాది .. అద్భుతాలను సృష్టించే అక్షర జ్ఞానం పెరిగిందని.. కానీ మానవత్వంలో మనిషిని ప్రేమించే గుణం కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు, ప్రజల మధ్య సమానత్వం సాధించే జ్ఞానం..స్ఫూర్తి ఇంకా మనిషి లో కొరవడిందని.. దీనిని గ్రహించి నేటి యువత సరైన మార్గాలను,నిర్దేశించుకోవాలని పిలుపునిచ్చారు.
యుగాలు గడిచిపోయిన తరగని స్మృతులను నెమరు వేసుకుంటూ నాటి త్యాగాలు నేటి యువతకు ఆదర్శాలుగా భావించినప్పుడే సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని రాజనీతి శాస్త్ర ఆచార్యులు డాక్టర్ బట్టు.విటల్ ముదిరాజ్ అన్నారు.
ప్రజాస్వామ్య పార్లమెంటరీ తరహా పాలను కలిగిన భారత దేశంలో నేటికీ రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక కాలంలో అనేక వివక్షతలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయని గుర్తు చేశారు . ఇందుకు కారణం వ్యక్తులలో పెరిగిన సంకుచిత తత్వం, స్వార్థపరమైన ఆలోచనలే కారణమని ఆయన అన్నారు. అంతరాలు లేని సమసమాజ నిర్మాణం జరిగినప్పుడే మహానీయుల ఆకాంక్షలు నెరవేరుతాయని పేర్కొన్నారు.గౌతమ బుద్ధుడు సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు బాపూలే, డాక్టర్ అంబేడ్కర్, పండగ సాయన్న ముదిరాజ్ , కెవల్ కిషన్ ముదిరాజ్ లాంటి మహనీయుల జీవిత ఆదర్శాలను నేటి యువత అధ్యయనం చేయాలని రాజనీతి శాస్త్ర ఆచార్యులు డాక్టర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. “యదార్థాలను సమాజానికి అందించినప్పుడే యువత తమ జీవిత సాఫల్యాన్ని సాధించినట్లుగా”భావించాలని కోరారు. లక్షల కోట్లు సంపాదించిన చివరికి తన వెంట తీసుకెళ్లలేమని, ఈ సమాజంలో మనిషి త్యాగాలే స్థిరమైన సంపదని ఆయన గుర్తు చేశారు. యుగాలు గడిచిన గుర్తుండే జీవితాలే “నిజమైన మానవ జీవితమని” కొనియాడారు.
సావిత్రిబాయి పూలే లాంటి జీవన మార్గాలను ఎంచు కున్న యువత భవిష్యత్ తరాల ముందు నిజమైన, శాశ్వతమైన మానవ జీవితమని గ్రహించి, జీవితాంతం సమాజానికి ఆదర్శవంతమైన నిలువుటద్దంగా నిలవాలని డాక్టర్ భట్టు విఠల్ ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొరివి నర్సింలు బిబిపేట్ మండల్ కొరివి అన్ని గ్రామాలలో ముద్రా ధులంతా ఏకతాటిపై ఉండి అన్ని గ్రామాలలో
మహాత్మా సావిత్రీబాయి పూలే వర్ధంతి సందర్భంగా…
RELATED ARTICLES