భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ , మొట్టమొదటిసారిగా దత్తత తీసుకున్న మహమ్మద్ నగర్ గ్రామాన్ని సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి మిగిలిన పనులు త్వరలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం తిప్పనపల్లి, గ్రామాన్ని సందర్శించి శుభసాయంత్రం కార్యక్రమం నిర్వహించి గ్రామస్తులు ద్వారా స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మహమ్మద్ నగర్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జారే
RELATED ARTICLES