తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
సంగెం మండలం, మొండ్రాయి గ్రామానికి చెందిన అతడు తన తండ్రి అయిన లక్క బక్కయ్య s/o రామస్వామి వయస్సు 65 సం. ముదిరాజ్ వృత్తి కూలీ అని అతడు కొంతకాలంగా తాగుడుకు బానిసై ఏ పని చేయకుండా ప్రతిరోజు తాగుతూ భార్యతో గొడవ పడుతుండేవాడు ఈ క్రమంలో బుధవారం రోజు ఉదయమే తాగి రాగా తన భార్య ఈరోజు పండుగ కదా ఈరోజు కూడా తాగి వచ్చినవని మందలించగా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి మనస్థాపంతో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగగా చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ గురువారం రోజు తెల్లవారి జాము రెండు గంటల 20 నిమిషాలకు చనిపోయినాడు అని సంగెం పోలీస్ స్టేషన్ లో లక్క రాజు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నరేష్ తెలిపారు.
మనస్థాపంతో పురుగుల మందు తాగి మృతి
RELATED ARTICLES