Tuesday, June 17, 2025

మధ్యాహ్నం భోజనం రుచిగా శుచిగా ఉండాలి



బుచ్చిరెడ్డిపాళెం జూన్ 06 (తేజన్యూస్ టీవీ )
ప్రభుత్వ బడి పిల్లలకు అందించే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం  రుచిగా, శుచిగా ఉండాలని  మండల విద్యాశాఖ అధికారి-2 పాతపాటి వెంకటరత్నం అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం డిఎల్ఎన్ఆర్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజన నిర్వాహకులకు శుక్రవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఇచ్చిన మెనూ ప్రకారం భోజనం చేయాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించి, వంటగది శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. పిల్లలందరికీ సమతుల పోషకాహారం అందేలా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్ గండికోట సుధీర్ కుమార్, సునీత, రేవతి, శీనమ్మ వ్యవహరించి మధ్యాహ్న భోజన నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డిఎల్ఎన్ఆర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల కేశవులు, ఉపాధ్యాయులు మస్తాన్, సీర్పీలు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular