TEJA NEWS TV :నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం ఆర్.ఎస్. రంగాపురం గ్రామాన వెలసిన లక్షల మంది భక్తుల ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నందు భక్తుల సౌకర్యార్థం కొరకు దేవస్థానమునకు చెందిన భూములలో హద్దులను తెలుసుకొని సదరు భూమియందు అభివృద్ధి పనులను చేపట్టడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆలయ ఉప కమిషనర్ కార్యనిర్వహణా ఆధికారి ఎం. రామాంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
భక్తులకు ఉచిత
ప్రసాదం పంపిణీ కార్యక్రమం
15-11-2024 వ తేదీన శుక్రవారం నాడు దేవాలయ శాఖ ఆదేశాల వరకు దేవస్థానం చుట్టుపక్కల గ్రామాలైన అంబాపురం రంగాపురం గ్రామాల్లోని బీసీ ఎస్సీ కాలనీలలో ఉదయం 8 గంటల నుండి శ్రీ మద్దిలేటి నరసింహ స్వామి వారి ఉచిత ప్రసాదం పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్టు ఆలయ ఉప కమిషనర్ కార్యనిర్వాహణాధికారి ఎం. రామాంజనేయులు తెలిపారు.
మద్దిలేటి స్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు భూమి పరిశీలన…… ఉపకమిషనర్ కార్యనిర్వహణ ఆధికారి ఎం.రామాంజనేయులు
RELATED ARTICLES