కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ పరిధి మడికొండలో రేపు సాయంత్రం 4 గంటలకు జరగబోయే కాంగ్రెస్ జన జాతర సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు యూత్ కాంగ్రెస్ ఐ ఎన్ టి యు సి కిసాన్ సెల్ మహిళా కాంగ్రెస్ ఎన్ ఎస్ యు ఐ మైనార్టీ విభాగం ఎస్సీ సెల్ బీసీ సెల్ ఎస్టీ సెల్ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు ప్రజలు యువతి యువకులు మేధావులు ప్రజాసంఘాల నాయకులు స్వచ్ఛందంగా ఈ యొక్క జన జాతర సభకు వచ్చి బహిరంగ సభను జయప్రదం చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు సాయిలి.ప్రభాకర్ కోరారు. ఈ యొక్క బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర రథసారథి రేవంత్ రెడ్డి మరియు ఏఐసిసి నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించుతూ పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించవలసిన విధి విధానాలను వివరిస్తారు కావున ఈ యొక్క బహిరంగ సభను ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి దిగ్విజయంగా జయప్రదం చేయాలని ప్రభాకర్ కోరారు.
మడికొండలో జరిగే జన జాతర సభను జయప్రదం చేయండి
RELATED ARTICLES