సంగెం మండల తేజ న్యూస్ టివి ప్రతినిధి నాగరాజు
హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి సీతక్క ని అసెంబ్లీలో ఎమ్మెల్యే లు నాగరాజు , గండ్ర సత్యనారాయణ ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ల క్ష్మణ్ ఎమ్మెల్యే కావ్వంపల్లి ని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సమావేశంలో భాగంగా వరంగల్ నుండి ఎంపీ బరిలో రామకృష్ణ నిలబడె ప్రయత్నం తెలియజేస్తూ మంత్రి సీతక్క ఆశీస్సులు తీసుకున్నారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే లకు ధన్యవాదములు.
డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని తాను కూడా వరంగల్ ఎంపీ బరిలో నిలబడాలి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులు మంత్రుల ఎమ్మెల్యేల సహకారాలు అదేవిధంగా ప్రజల ఆశీస్సులు తమపై ఉండాలని ప్రజలకు నేను చేసిన సేవే నన్ను గెలిపిస్తుందని ప్రజల పై పూర్తి నమ్మకం వుంది అన్నారు .రేవంత్ రెడ్డి పరిపాలన చాలా అద్భుతంగా ఉందని ప్రజలందరికీ తప్పకుండా న్యాయం జరుగుతుందని రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలని విజయవంతంగా పూర్తి చేస్తారని ఈ సందర్భంగా రామకృష్ణ అన్నారు.
మంత్రి సీతక్కని మర్యాదగా పూర్వకంగా కలిసిన వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
RELATED ARTICLES