కొత్తగూడెం: చండ్రుగొండ మండలం రావికంపాడు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొగినబోయిన కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు కొదుమూరి జనార్దన్ రావు, కోదండ రామాలయ చైర్మన్ ఇనుముల కృష్ణయ్య, కమిటీ సభ్యులు ఉమ్మడి రాంబాబు, కుక్కల ముత్యాలరావు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఇరువురిని వెంట తీసుకొనిహైదరాబాద్ లో ఉన్న మంత్రివర్యుల శ్రీనివాసరెడ్డి తో పరిచయం చేసిన సందర్భంగా రావికంపాడు లో శ్రీ కోదండ రామాలయ నిర్మాణానికి కావలసిన పనులను అడిగి తెలుసుకొని టీటీడీ అధికారులు ను కలిసి పత్రాలు అందజేశారు. గ్రామంలోని సమస్యలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వారితో క్లుప్తంగా వివరించి చెప్పిన గ్రామ శాఖ అధ్యక్షుడు బొగినబోయిన కోటేశ్వరరావు, విషయంపై స్పందించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి నిలబడి కట్టుబడి ఉన్నవారి నీ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి తో రావికంపాడు గ్రామంలోని డ్రైనేజీ సమస్య గురించి అడగగా వెంటనే సానుకూలంగా స్పందించి త్వరలోనే రావికంపాడు గ్రామానికి డ్రైనేజీ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ నాయకులు కార్యకర్తలు సంతోషించి మంత్రి పొంగిలేటి, ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు కృతజ్ఞతలు తెలియజేశారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డిని కలిసిన గ్రామ శాఖ అధ్యక్షుడు భోగినబోయిన కోటేశ్వరరావు
RELATED ARTICLES