TEJA NEWS TV :ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థిని పార్వతి ఆత్మహత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురి మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డిఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్న పార్వతి అనే పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి
ఆవేదన వ్యక్తం చేశారు.వివరాల్లోకెళితే కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం సుంకేశ్వరి గ్రామానికి చెందిన పార్వతి అనే బాలిక మంత్రాలయం మండలంలోని రాచుమర్రి గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ లో పదవ తరగతి చదువుతుంది. అనుమానాస్పద స్థితిలో నిన్నటి దినమున అనగా ఆగస్టు 5వ తేదీ ఆదివారం నాడు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్న విషయం తెలుసుకున్న మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డి సోదరుడు రామకృష్ణ రెడ్డి సబ్ కలెక్టర్ శివనారాయణ శర్మ ,మంత్రాలయం ఎమ్మిగనూరు సిఐలు సుదర్శన్, రామాంజనేయులు మరియు మాధవరం సబ్ ఇన్స్పెక్టర్ లతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలిక మృతిపై అనుమానాలు ఉన్నాయని నిజంగా ఆత్మహత్యనా లేక హత్యనా అన్న విషయం పరిశీలించి తీర్చాలంటూ అధికారులకు సూచించారు. రాత్రి వేళలో బాలికల హాస్టల్లో విద్యార్తినులకు తోడుగా ఉండి వారిని జాగ్రత్తగా చూసుకోవాలని హాస్టల్ వార్డెన్ లకు సూచించిన రామకృష్ణ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని మాధవరం రామిరెడ్డి కుటుంబం అన్నివేళలా మీ కుటుంబానికి తోడుగా ఉంటుందని మనోధైర్యంతో ఉండాలని సూచించారు. నిన్నటి దినమున కూడా పార్వతి ఆత్మహత్య పై విద్యార్థి సంఘాలు అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి తో పాటు భారీ ఎత్తున టిడిపి కార్యకర్తలు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.