TEJA NEWS TV
వరదయ్యపాలెం మండలం, తిరుపతి జిల్లా
తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం,వరదయ్యపాలెం మండలంలో రాచెర్ల గ్రామానికి చెందిన 75 మంది రైతులకు ప్రభుత్వం ద్వారా,ఓ పరిశ్రమకు భూములు ఇచ్చినప్పటికీ,ఇప్పటివరకు పరిహారం అందని బాధితుల పరిహారం కోసం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ యస్ సి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైసీపీ రాష్ట్ర యస్ సి సెల్ కార్యదర్శి బందిల బాలయ్య అధ్యక్షతన రిలే నిరాహార దీక్ష చేపట్టారు.గత 5సంవత్సరాలుగా తమకు పరిహారం ఇవ్వకపోవడం దారుణమని,ఈనెల చివరి 30తారీకు లోపల పరిహారం ఇవ్వకపోతే,నియోజకవర్గం కేంద్రమైన సత్యవేడు నడిబొడ్డులో గాంధీ బొమ్మ వద్ద పెద్ద ఎత్తున కార్యక్రమం చేపడుతామని బాలయ్య,అధికారులను హెచ్చరించారు.అంతే గాక రాచర్ల ఆర్ బి కే వైస్ చైర్మన్ భూషణం మాట్లాడుతు వైఎస్సార్సీపీ ప్రభుత్వపెద్దలు,యస్సి,యస్టీ లను చులకన భావంతో చూస్తూ,మాకు రావలసిన పరిహారాన్ని నాన్చుడు ధోరణితో వ్యవహారిస్తున్నారని,మాలాంటి పేద వారి కడుపు కొడుతున్నారని వాపోయారు.చిన్న పాండురు పంచాయతి,వికేఆర్వై కాలనికి చెందిన గంగమ్మ యస్టీ కులాల మైన మమ్ములను చిన్న చూపు ధోరణితో చూస్తున్నారని,ఇంత వరకు మాకు పరిహారం రాకుండా మమ్ములను తిప్పని చోటు అంటూ లేకుండా తిప్పుతున్నారని ఆవేదన చెందారు.ఇటీవల మా తండ్రికి బాగ లేక ఆసుపత్రి ఖర్చులకు చూపించు కొనే స్థోమత లేక పరిహారం వస్తుందని ఎదురు చూశాను, కానీ ఆయన చనిపోయాడు,ఇప్పుడు ప్రస్తుతం తన భర్త నడుము నొప్పులతో బాధ పడుతూ మంచం మీద వున్నారని ఇప్పటి కైన ప్రభుత్వ అధికారులు మా ప్రాణాలతో చెలగాటం ఆడకుండా మాకు పరిహరం ఇవ్వాలని ఆమె కోరారు
వరదయ్యపాలెం _సత్యవేడు రహదారి మార్గాన భారీగా నిలిచిపోయిన వాహనాలు
విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ ఐ నాగార్జునరెడ్డి సంఘటన స్థలానికి,ఏఎస్ఐ షణ్ముగం ను పంపించి అక్కడ సమస్యను పరిష్కారించాలని తెలపడంతో, ఆయన సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ బాలయ్య తో మాట్లాడారు. బాలయ్య ససేమిర అనడంతో తహశీల్దార్ గౌరీ శంకర్ తో చరవాణిలో మాట్లాడించడంతో ఈ నెల ఆఖరు లోపు పరిష్కరిస్తామని చెప్పడంతో,దీక్ష విరమింపజెసి,ట్రాఫిక్ పునరుద్ధరించారు.ఈ కార్యక్రమంలో మునస్వామి,రెడ్డి ప్రసాద్,చెంగయ్య,చంద్రయ్య, తొండ సురేష్,జేమ్స్,మహిళలు పాల్గొన్నారు.
భూ పరిహారం కోసం రిలే నిరాహార దీక్ష మరియు రాస్తారోకో
RELATED ARTICLES