కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లో ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లా ఆలూరు మండల కేంద్రంలో నిర్వహించిన రాజ్యాంగం దినోత్సవ వేడకలో పాల్గొని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం ప్రజలందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి గారు.
ఈ సందర్భంగా మంత్రి సోదరుడు మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి నిర్దేశకత్వంలో 1949లో ఇదే రోజున రాజ్యాంగం సిద్ధమైంది.ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శంగా నిలిచింది. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు,విధులను కూడా అనుసరిస్తూ జీవించడం మన బాధ్యతగా భావించాలని, రాష్ట్రంలో సీఎం జగనన్న పాలనలో దళిత, గిరిజన, బడుగు, బలహీన,మైనారిటీ వర్గాల అభ్యున్నతికి బాటలు పడుతున్న వేళ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని మనసా సర్మించుకుందామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వీరేష్,పలువురు దళిత సంఘాల నాయకులు,తదితరులు పాల్గొన్నారు..
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కు నివాళులర్పించిన మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి
RELATED ARTICLES