భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
దమ్మపేట మండలం సరోజనపురం గ్రామంలో భారతీయ యువసేవ రాష్ట్ర కార్యాలయంలో ఐదు జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జాతీయ యువ మోర్చా అధ్యక్షులు మద్దిశెట్టి సామెలు మాట్లాడుతూ గిరిజన పూజారుల సమస్యలను హైకోర్టు ఆదేశాల ప్రకారం శాంతియుతంగా అధికారులను కలుసుకుంటూ పరిష్కరించుకోవాలని సూచించారు. యువత మద్యపానం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో మౌలిక వసతుల సమస్యలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు మండలాల వారీగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఐలయ్య, రామదాసు, హరిబాబు, వెంకన్న, రమేష్, కృష్ణ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
భారతీయ యువసేవ సంగ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం
RELATED ARTICLES



