Sunday, January 18, 2026

భారతీయ జనతా పార్టీ లో భారీగా చేరికలు



తేజ న్యూస్ టివి ప్రతినిధి,

హనుమకొండ బీజేపీ పార్టీ కార్యాలయంలో, సంగెం మండల బీజేపీ , మాజీ మండల ప్రధాన కార్యదర్శి భూక్య వెంకన్న ఆధ్వర్యంలో,హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా. విజయ్ చందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మునుగూరు శ్రీనివాస్ సమక్షంలో
*చింతలపల్లి గ్రామం, సంగెం మండలం నుండి కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు, బూత్ స్థాయి నాయకులు భారీగా బీజేపీలో చేరారు
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి  వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా *జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి  మాట్లాడుతూ* –
“భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, విలువల ఆధారంగా నడిచే పార్టీ. మేము ‘అంత్యోదయ’ సిద్ధాంతాన్ని అనుసరిస్తాం, అంటే సమాజంలో చివరి వ్యక్తికి కూడా న్యాయం, అభివృద్ధి అందాలన్నదే మా లక్ష్యం. బీజేపీ కుటుంబ పాలనలో నడిచే పార్టీ కాదు. ఇక్కడ ప్రతి కార్యకర్తకు ఎదగడానికి సమాన అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే తెలంగాణలో గాలి బీజేపీ వైపుగా వీస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, మెజారిటీ స్థానాలు గెలుస్తుందని విశ్వాసం ఉంది” అని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular