

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
18-1-2025
చండ్రుగొండ మండల కేంద్రంలో మరియు రావికంపాడు, బెండలపాడు, గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు 29వ వర్ధంతి ఘనంగా నివాళులు అర్పించారు. ముఖ్యఅతిథిగా కట్రం స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొనగళ్ళ వెంకటరెడ్డి మాట్లాడుతూ యుగపురుషుడు దైవంతో సమానమని గొప్ప కళాకారుడని ఒక గొప్ప నటుడిగా గుర్తింపు పొంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు గా అతి తక్కువ కాలంలో రాజకీయవేతగా గుర్తించబడి తెలుగు భాష సంస్కృతిని ప్రపంచమంతటా గుర్తింపు వచ్చే విధంగా కృషిచేసిన మహానీయుడు అన్నారు. వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొనగల వెంకటరెడ్డి, దారా బాబు, మేడ మోహనరావు, భోజ్య నాయక్, సూరా వెంకటేశ్వర్లు, కొదుమూరి సత్యనారాయణ, వారాధి సత్యనారాయణ, గోవిందరెడ్డి, సిహెచ్ వెంకటేశ్వర్లు, కే వేణు, వరి కూటి వెంకటరావు ఉప్పర్ల వేణు, j. శ్రీనివాసరెడ్డి ఎస్కే లాల్ మధు, ఆకుల సత్యనారాయణ, సిహెచ్ కిరణ్, కొదుమూరి జనార్దన్ రావు, నిక్కడుపు రామారావు, మద్దిరాల చిన్న పిచ్చయ్య, బి రమేష్, బి శ్రీనివాసరావు, ఆనంగి కోటయ్య, ఇమ్మడి కన్నయ్య, ఇనుముల శ్రీనివాసరావు, ఇమ్మడి వెంకటేశ్వర్లు, ఇమామ్, సలీం, రాచర్ల వెంకటేశ్వర్లు, తదితర అభిమానులు పాల్గొన్నారు.