Wednesday, March 19, 2025

భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
భద్రాచలం
07/03/2025



భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు మహిళా సాధికారిక విభాగం ఆధ్వర్యంలో సి.పి.డి.సి మరియు రోటరీ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఘనంగా నిర్వహించబడినవి.

ఈ కార్యక్రమానికి భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు,ముఖ్య అతిథిగా హాజరై, మహిళా సాధికారతపై విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో సి.పి.డి.సి సెక్రెటరీ బూసిరెడ్డి శంకర్ రెడ్డి , రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్ , ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీ హిమజ , మహిళా సాధికారిక విభాగం కోఆర్డినేటర్ డాక్టర్ వి. రాగసుమ భాగ్య , కో-ఆర్డినేటర్ డాక్టర్ సమీరా , ఆఫీసు సూపరింటెండెంట్ రేవతి , మాథ్స్ డిపార్ట్మెంట్ శ్రీలత, మరియు అధ్యాపకులు భవాని, పావని, కృష్ణవేణి, కల్పన, లక్ష్మీదేవి, మంజులత, జ్యోతి, అర్చన, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో మహిళా సాధికారిక విభాగం సభ్యులు ఎంతో కృషి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular