Tuesday, June 17, 2025

భక్తాంజనేయ ఆలయంలో జనసేన నేత రమాదేవి ప్రత్యేక పూజలు – సైనికుల విజయానికి ప్రార్థనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సైనికులకు దేశ నాయకత్వానికి దైవబలం తోడవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుమేరకు తిరుమల నడక మార్గంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ పాల్గామ్ లోని ఉగ్రవాదులు సృష్టించిన నరమేధానికి బదులుగా భారతదేశ ప్రభుత్వం ప్రధాని మోడీ నాయకత్వంలో మన భారత సైన్యం పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను తుద ముట్టించారు. అంతేకాక మన దాయాది దేశమైన పాకిస్తాన్ ను ఇలాంటి చర్యలకు పాల్పడకుండా భారత సైన్యం పాకిస్తాన్ యొక్క దాడులను ధీటుగా ఎదుర్కొంటూ వారికి తగిన బుద్ధి చెబుతూ ఎంతో సమర్థవంతంగా తిప్పికొట్టి విజయం సాధించారు. అటువంటి భారత సైన్యానికి భారత దేశ నాయకత్వానికి దైవ బలం తోడుండాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో భారత రక్షణ దళాలు చేస్తున్న పోరాటంలో భారత్ విజయం సాధించాలని, వారంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తిరుమల నడకదారి శ్రీవారిమెట్టు వద్ద శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం  నందు ప్రత్యేక పూజలు నిర్వహించి భారత సైన్యానికి భారతదేశ నాయకత్వానికి మేము సైతం అంటూ మా యొక్క ఐక్యతను తెలియజేస్తున్నాము….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular