Saturday, January 17, 2026

బెల్ట్ షాపుల సమాచారం అంటేనే  ఎక్సైజ్ ఎస్సై గిట్టడం లేదు

ఫోన్ చేయకు పెట్టేయ్.

బెల్ట్ షాపుల సమాచారం అంటేనే  ఎక్సైజ్ ఎస్సై గిట్టడం లేదు.

విధుల్లోకొచ్చి మూడు శుక్రవారా లు కాలేదు.
వెంటనే మాటలో మార్పు.

సమాచారం అందించిన విలేకరిపై దురుసు సమాధానం.

పలు అనుమానాలకు తావిస్తున్న  ఆ ఎక్సైజ్ ఎస్సై పనితీరు.

TEJA NEWS TV : ములుగు జిల్లా ఎటునాగారం మండలం కేంద్రంలోని మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి,
ఎక్కడ  చూసిన  వైన్ షాప్ టు వయా బెల్టు షాప్ ల అక్రమ రవాణా ఆర్టీసీ రవణ ను తలపిస్తుంది.   పలువురు రాజకీయ నాయకుల అండదండలతో  వారి సొంత ధరలతో అక్రమ దందా, మూడు పువ్వులు ఆరు కాయలుగా తేజరిల్లుతోంది. ఈ విషయంలో సంబంధిత ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం  కొట్టొచ్చినట్టు కనబడుతోంది అని తెలుస్తోంది ,పట్టపగలే బెల్టు షాపులకు మద్యం తరలి వెళ్తున్న  విషయాన్ని తేజ న్యూస్ టీవీ పాత్రికేయుడు తెలిపినప్పటికీ,  మద్యం అక్రమ విక్రయాల పట్ల గాఢ నిద్రపోతున్న ఆ ఎక్సైజ్ ఎస్ ఐ  రాకపోవడమే కాకుండా  వారి అలసత్వ సమాధానం  ముందుగానే ఆ ఎక్సైజ్ ఎస్ ఐ బెల్ట్ విక్రయదారులతో మమేకమయ్యారేమో  అంటూ మండల ప్రజలు వారి చర్యలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  దాన్ని రుజువు చేస్తూ  సమాజాన్ని ఉద్ధరించడానికి బెల్ట్ షాపులు తప్ప మరొకటి  దొరకలేదా అంటూ రివర్స్ గా ఎక్సైజ్ ఎస్సై పాత్రికేయునిపై విజృంభించడం  మండలంలో సంచలనంగా మారింది. బెల్ట్ దందాను నిర్మూలించాల్సిన ఎస్సై, పాత్రికేయుడు మద్యం బెల్ట్ షాపులకు తరలి వెళ్తోంది అని సమాచారo ఇచ్చినప్పటికీ  మద్యం విక్రయదారులకు వత్తాసు పలికినట్టుగా ఆ ఎస్ ఐ  మాట్లాడటం, ఏ మేరకు వారు విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారో చెప్పకనే చెబుతోంది అని మండల  ప్రజలు వారి చర్యలపై మండిపడ్డారు.
మూడు శుక్రవారలకే  మారిపోయారా సారు అని  ఆ ఎక్సైజ్ ఎస్సై పట్ల మండల ప్రజలు ఎద్దేవా చేశారు. మూడు వైన్ షాపులను కైవసం చేసుకున్న ఎటునాగారం  మద్యం విక్రయదారులు,  ఒక మండలానికి సరిపోయేంత టెండర్ను పాడి , రెండు మండలాలను కవర్ చేస్తున్నారంటే వారి అక్రమ మద్యం వ్యాపారం ఏ విధంగా కొనసాగుతుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.ఉన్న మండలంలో ఏమో కానీ పక్క మండలం  మంగపేటలో మాత్రం జోరుగా మద్యం అక్రమ విక్రయాలు జరుపుతుండడం  అధికారుల అలసత్వం  కొట్టొచ్చినట్టు కనబడుతుందని మండలంలోని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ విషయాలన్నీ ఎక్సైజ్ అధికారులకు తెలిసినప్పటికీ  కోడి నిద్ర వహించడం  వారి రోజువారీ దినచర్య ఏ విధంగా ఉందో పై అధికారులను సైతం ఆలోచించేలా చేస్తోందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు  ఇంకా కొన్ని రోజులు ప్రతి ఊర్లో బెల్ట్ వ్యాపారం జరిగితే, ఇరు మండలాలలో మందుకు బానిసలైన వారు తిరిగిరాని లోకాలకు చేరుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని  మండలం అంతా కోడైకూస్తుంది. ఇకనైనా ఉన్నతాధికారులు ఈ విషయంలో చొరవ తీసుకొని ఏటూరు నాగారంలో, మంగపేట మండలంలో  జరుగుతున్నటువంటి బెల్ట్ దందాను అరికట్టే విధంగా చర్యలు తీసుకొని సగటు రోజు వారి కూలీల బతుకులలో వెలుగులు నింపాలని  మండల ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular