
బుచ్చిరెడ్డి పాలెం జూన్16 ( తేజ న్యూస్ టీవీ )
– ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
– త్వరలోనే విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు
బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. సోమవారం ఉదయం బుచ్చిపంచాయతీలోని 20 వ వార్డు రామచంద్రాపురంలో ఆమె పర్యటించారు. అలాగే రూ.10 లక్షలతో నిర్మించ తలపెట్టిన డ్రైనేజీకి ఆమె శంకుస్థాపన చేశారు. ముందుగా 20 వార్డుకు చేరుకున్న ఎమ్మెల్యేకు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం డ్రైనేజీకి శంకుస్థాపన చేసి 20 వార్డులో వసతులపై పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 20 వార్డు రామచంద్రాపురంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 10 లక్షల నిధులతో డ్రైనేజీ ఏర్పాటుకు శంకుస్థాపన చేశామని తెలిపారు.
అలాగే ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రజల కనీస అవసరాలను అనుగుణంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. స్థానికంగా స్మశానానికి ప్రహరీ లేని విషయాన్ని స్థానికులు తమ దృష్టికి తెచ్చారని, త్వరలోనే ప్రహరీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అలాగే స్థానికంగా ప్రజలకు అందుబాటులో సచివాలయం లేనందున సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోందని, ప్రభుత్వ అధికారులతో సంప్రదించి సచివాలయం ఏర్పాటుకు ప్రయత్నిస్తామన్నారు. త్వరలోనే విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, ప్రజలందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో బుచ్చి ఛైర్‌పర్సన్ మోర్ల సుప్రజ, ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ కమిషనర్ డి బాలకృష్ణ, తాసిల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు శ్రీదేవి, బెలూం మల్లారెడ్డి, టిడిపి బుచ్చి మండల రూరల్ అధ్యక్షులు , బెజవాడ జగదీష్, అధ్యక్షులు టంగుటూరి మల్లారెడ్డి, టిడిపి నాయకులు ఎర్రం రెడ్డి గోవర్ధన్ రెడ్డి, జొన్నవాడ ఆలయ మాజీ ఛైర్మెన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు, ఎంవి శేషయ్య, బత్తుల హరికృష్ణ, మోర్ల మురళి, కోడూరు కమలాకర్ రెడ్డి, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.