TEJA NEWS TV
– మండల సర్వ సభ్య సమావేశానికి గైర్హాజరైన సిహెచ్‌సి డాక్టర్లపై ఎమ్మెల్యే ఆగ్రహం.
– రోడ్ల మలుపుల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయండి.
– విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యాభ్యాసం చేయండి.
– బడి పిల్లల భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించండి.
– రానున్న ఉగాది సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులు, రైతులకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక పురస్కారాలు.
– బుచ్చి మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆమెకు బుచ్చిరెడ్డి పాళెం నాయకులు ఘన స్వాగతం పలికారు. తిరుమల తిరుపతి ఆలయ పాలక మండలి సభ్యురాలిగా నియమితులైన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి స్థానిక నాయకులు, అధికారులు అభినందనలు తెలియ చేశారు. మండల సర్వ సభ్య సమావేశంలో ముందుగా విద్యాశాఖకు సమందించిన పురోగతిని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయులు సభ దృష్టికి తెచ్చారు. వివిధ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమిని వివరించారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు విద్యార్థినీ విద్యార్థులకు చదువుతో పాటు బాల్య దశ నుంచే మౌలిక విలువలు బోధించాలని కోరారు. బడి పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బెస్ట్ రిజల్ట్స్ వచ్చేలా కృషి చేయాలన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు రానున్న ఉగాది సందర్భంగా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పురస్కారాలు అందచేస్తామన్నారు.
వ్యవసాయ సమీక్షపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పందిస్తూ ఆర్గానిక్ వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులను కోరారు. రానున్న ఉగాది సందర్భంగా మండలాల వారీగా ఉత్తమ రైతులు, పాడి రైతులను ఎంపిక చేసి ఫౌండేషన్ ద్వారా ప్రత్యేక పురస్కారాలు ప్రత్యేక పురస్కారాలు అందచేస్తామన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయకుండానే బిల్లులు డ్రా చేసుకున్న కాంట్రాక్టర్లను గుర్తించి కేసులు పెట్టి స్వాహా చేసిన ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేయాలని ఆమె హోసింగ్ అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా జరిగిన సమీక్షలలో అధికారులకు పలు సూచనలు సలహాలు అందచేశారు. బిజెపి ఎంపిటిసి వినయ్ నారాయణ లేవనెత్తిన ప్రశ్నల పై స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి 24 గంటలు సేవలు అందివ్వాల్సిన బుచ్చి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రాత్రులు డాక్టర్లు అందుబాటులో ఉండని విషయంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య అధికారులకు సూచించారు. గ్రామీణ రోడ్ల పై మలుపులు వుండే చోట రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా బాధ్యతాయుతంగా విధి నిర్వహణ చేయాలని అధికారులను కోరారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ పై వరి విత్తనాలను అందచేశారు. పాడి పంటలతో రైతులు సుభిక్షంగా వుండాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు.ఎంపిపి మన్నేపల్లి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన మండల సర్వ సభ్య సమావేశంలో ఎంపిడిఓ శ్రీహరి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, జెడ్పిటిసి శ్రీదీపలతో పాటు మండల పరిధిలోని ఎంపిటిసిలు, సర్పంచులు పాల్గొన్నారు.
బుచ్చిరెడ్డి పాళెం: పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసిన కాంట్రాక్టర్లపై కేసులు పెట్టండి – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
RELATED ARTICLES