తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని బుచ్చినాయుడు కండ్రిగ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని స్వచ్ఛభారత్ కార్మికులు ముట్టడి ఈ సందర్భంగా ఏఐటీయూసీ నియోజకవర్గ గౌరవాధ్యక్షులు ఆంబాకం చిన్ని రాజ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు పారిశుద్ధ్యం ఆరోగ్యం పరిరక్షించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకంలో పని చేస్తున్న స్వచ్ఛ భారత్ పంచాయతీ కార్మికులకు 24 నెలల జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఒకపక్క పంచాయతీ రాజ్రాష్ట్ర కమిషనర్ జిల్లా డిపిఓలు 15వ ఆర్థిక సంఘం నిధులలో పంచాయతీలో స్వచ్ఛభారత్ కార్మికులకు జీతాలు ఇవ్వాలని ఆదేశించడం జరిగింది మీరు వెళ్లి కలవండని చెబుతున్న క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదని చిన్నిరాజు ఆవేదన వ్యక్తం చేశారు 24 నెలలు జీతాలు ఇవ్వాల్సి ఉంటే ఒక నెలకి ఇస్తామని పంచాయతీ కార్మికులు చెప్పడం విడ్డూరమని కనీసం 10 నెలల జీతాలు అయినా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు
స్వచ్ఛభారత్ కార్మికులకు అరువేల నుండి పదివేల రూపాయలు పెంచుతూ జీవో 680 విడుదల చేసి సంవత్సరాలు గడుస్తున్న అమలుకు నోసుకోలేదని కార్మికులకు పని భద్రత ఈఎస్ఐ పిఎఫ్ సర్కిల్ కల్పించాలని కార్మికులపై రాజకీయ వేదింపులు మానుకోవాలని సమాన పనికి సమాన వేతనం 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన అమలు చేయడం లేదని కార్మికులకు మాస్కులు బ్లౌజులు శానిటరైజర్స్ మరియు యూనిఫామ్ ఇవ్వాలని ప్రతి కార్మికులకు గుర్తింపు కార్డు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛభారత్ కార్మికుల సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు అన్నదరై వ్యవసాయ కార్మిక సంఘం సత్తి నియోజకవర్గ కార్యదర్శి కత్తి ధర్మయ్య స్వచ్ఛభారత్ కార్మిక సంఘ నాయకులు ముని చంద్ర గంగయ్య రామయ్య రాజా తదితరులు పాల్గొన్నారు
బుచ్చినాయుడు కండ్రిగ : స్వచ్ఛ భారత్ పంచాయతీ కార్మికులకు 24 నెలల జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని
RELATED ARTICLES