TEJA NEWS TV: తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపులను మళ్లీ పాత పద్ధతిలో డీలర్ల చేతుల్లోకి అప్పగిస్తూ పునఃప్రారంభించింది. ఈ నిర్ణయం వల్ల మండలంలోని ప్రజలకు తిరిగి స్థిరమైన రేషన్ సరఫరా జరుగనుంది.
ఈ నేపథ్యంలో, రేషన్ కార్డు కలిగిన లబ్దిదారులకు రేషన్ మరియు నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో, మాజీ ఎంపీపీ శ్రీ బట్ట రమేష్ యాదవ్ గారి తనయుడు శ్రీ బి. ఆర్. గిరీష్ యాదవ్ గారు, స్వయంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు.
ఈ చర్యతో మండల ప్రజల హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రజలకు అందుబాటులో రేషన్ మరియు అవసర వస్తువులు ఉండేలా చర్యలు తీసుకోవడమే తమ బాధ్యతని శ్రీ గిరీష్ యాదవ్ తెలిపారు.
బుచ్చినాయుడు కండ్రిగలో రేషన్ పంపిణీ పునఃప్రారంభం
RELATED ARTICLES