TEJA NEWS TV TELANGANA :కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో బీసీ అభ్యర్థి కొరివి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ, బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 42 శాతం ఉన్న బీసీలకు న్యాయం జరగాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, నామినేట్ పోస్టుల్లో బీసీలకు హక్కులు కల్పించాలని కోరారు.
అదేవిధంగా విద్యార్థులు, రైతులు, బీడీ కార్మికులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలను నెరవేర్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు.
బీసీల హక్కుల కోసం తాను నిరంతరం పోరాటం చేస్తానని కొరివి నర్సింహులు పేర్కొన్నారు.
బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి – కొరివి నర్సింహులు డిమాండ్
RELATED ARTICLES



