కామారెడ్డి జిల్లా బిబిపేట మండల కేంద్రంలో గల ఇంద్ర నగర్ కాలనీలో ఎన్ ఆర్ జి ఎస్ పథకం కింద మంజూరైన పదిలక్షల సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుతారి రమేష్ ప్రారంభించారు. ప్రజల సంక్షేమ అభివృద్ధి పనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు భవిష్యత్ తరాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజల అదృష్టం మేరకే పని చేస్తారని వారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భూమా గౌడ్ , మాజీ ఉపసర్పంచ్ సాయినాథ్ , కాంగ్రెస్ నాయకులు సలీం, అరుణ్, మహేష్, బాబా ఫక్రుద్దీన్, నీరజ, లక్ష్మి భూమేష్, పరశురాములు, స్వామి, తోట రమేష్ , రవి , తదితరులు పాల్గొన్నారు.
బీబీపేట మండలంలో సిసి రోడ్ల పని ప్రారంభం
RELATED ARTICLES