Sunday, January 18, 2026

బీబీపేట్‌: పద్మశాలియుల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు


బీబీపేట్, కామారెడ్డి జిల్లా – ఆగస్టు 15

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని, శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం, బీబీపేట్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షుడు తుమ్మ రాజేందర్ జెండా వందనం చేశారు.

ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం డివిజన్ అధ్యక్షుడు తుమ్మ మచ్చేందర్ ముఖ్య అతిథిగా హాజరై, “స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు. 1907లో స్వదేశీ వస్త్ర ఉద్యమం ద్వారా ప్రజల్లో చైతన్యం పెరిగింది. పద్మశాలీలు కూడా స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు” అని అన్నారు.

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు. “మన స్వేచ్ఛ వెనుక లక్షల మంది త్యాగం ఉంది. దేశం పట్ల గౌరవం, బాధ్యత పెరగాలి” అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో పద్మశాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular