కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో మంగళవారం వై.ఆర్.జి కేర్ ఫౌండేషన్ లింక్ వర్కర్ స్కీం ఆధ్వర్యంలో హెచ్ఐవి పై అవగాహన కల్పించడం జరిగింది. లింకు వర్కర్ బాలకిషన్ బిపి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు భానుప్రియ, గ్రామ కార్యదర్శి రమేష్ ను కలిసి లింకువర్కర్ సేవల గురించి తెలియజేయడం జరిగింది. అనంతరం గ్రామ సంఘం కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్ఐవి టీబీ సుఖ వ్యాధులపై అవగాహన కల్పించారు. హెచ్ఐవి నివారణ జాగ్రత్తల గురించి వివరించారు. ఆయా వ్యాధుల రెఫరల్ సర్వీస్ లను తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ సంఘం వివోఏలు చంద్రకళ, పద్మ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.