కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని హసన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పిప్పి రేగడి తాండ కు చెందిన గిరిజనులందరు ఐక్యమత్యమై ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్ షిండే కు మా పూర్తి మద్దతు ఉంటుందని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన కాపీని ఉమ్మడి జిల్లాల జడ్పీ మాజీ చైర్మన్,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దపేదర్ రాజు కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గంగారెడ్డి, సింగల్ విండో చైర్మన్ వాజిద్ అలీ, నాయకులు మహేందర్, కాశయ్య,ఎఫ్తేకార్, రామా గౌడ్, లక్ష్మీ కాంత్ రెడ్డి, క్యాస గుండయ్య, బోయిని హరీన్ కుమార్, ధ్యామ గారి ఆగమయ్య, మంగలి చిన్న రాములు, నికీల్,హరిజన్ దుర్గయ్య, తాండ పెద్దలు లంబాడి బిజ్జు, మొతిరాం, రమేష్ ,గణేష్, దేవుల, గంగారాం, రవి, రాంచందర్, పెద్ద రవి,సంగ్య, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఏకాగ్రీవ తీర్మానం
RELATED ARTICLES