నంద్యాల జిల్లా రుద్రవరం మండలకేంద్రంలోనీ ఎంపీడీవో కార్యాలయం నందు సోమవారం ఎంపీడీవో భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకునేందుకు బీసీ అన్ని వర్గాలకు చెందిన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకం కింద బ్యాంకు లింకు స్కీం ద్వారా రుణాల కొరకు లబ్ధిదారులు ఓబి ఎంఎంఎస్, యాప్ లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి అర్హత 21 నుంచి 60 సంవత్సరాల లోపు వారు దారిద్ర రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగి వారు అర్హులన్నారు. రుణాలు 1 స్లాబ్ కింద రూ 2 లక్షలు, స్లాప్ 2 కింద రూ 3 లక్షలు, స్లాబ్ 3 కింద రూ 5 లక్షలు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున లబ్ధిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
బిసి కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోండి
RELATED ARTICLES