TEJA NEWS TV : రాప్తాడు సిద్ధం సభలో రిపోర్టర్ పై జరిగిన దాడిని ఖండించిన బి యన్ కండ్రిగ జర్నలిస్ట్ యూనియన్.
జర్నలిస్ట్ పై భౌతిక దాడులను అరికట్టాలి -ఆం,ప్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇంచార్జ్ వేణు
బి యన్ కండ్రిగ లో ప్రతిపక్షం,అఖిల పక్ష నాయకుల మద్ధతు తో నిరసన కార్యక్రమం
తిరుపతి జిల్లా బి యన్ కండ్రిగ మండలంలో జర్నలిస్ట్ లు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ నెల 18 వ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ వీడియోలు చిత్రీకరిస్తున్న నేపథ్యంలో అతని పై వైసీపీ అల్లరి మూకలు విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే వైసీపీ గుండాలను అరెస్టు చేయాలని ,ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సత్యవేడు నియోజకవర్గ ఇంచార్జ్ ,బి యన్ కండ్రిగ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బొర్రా వేణు,బి యన్ కండ్రిగ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి, డిప్యూటీ తహశీల్దార్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో,రాజకీయ పార్టీలు తెలుగుదేశం, సీపీఐ నాయకులు పాల్గొని,రాష్ట్రంలో జర్నలిస్ట్ లపై దాడులను ముఖ్యమంత్రి చూసి చూడనట్లుగా వ్యవహరించడం బాధాకరమని,మానవత్వం తో స్పందించని ప్రభుత్వం సామాన్యులకు న్యాయం చేస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. రిపోర్టర్ పై జరిగిన దాడిలో పోలీసులు పాత్ర కూడా ఉండి ఉంటుందని, సిద్ధం సభలో రాష్ట్ర పోలీసు శాఖ మొత్తం అక్కడ ఉన్నా కూడా భౌతిక దాడిని అరికట్టలేకపోయింది అంటే రాష్ట్రం లో భద్రత కు కరువైంది అని స్పష్టం గా తెలుస్తుంది అని రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఈ ప్రభుత్వానికి చరమ గీతం తప్పకుండా పాడుతారని,వాపోయారు. ఈ కార్యక్రమంలో బి యన్ కండ్రిగ తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు,సీపీఐ నాయకులు,జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
బియన్ కండ్రిగ:జర్నలిస్ట్ పై భౌతిక దాడులను అరికట్టాలని నిరసన
RELATED ARTICLES