TEJA NEWS TV TELANGANA
కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలంలో ప్రతి వారం నిర్వహించే వీక్లీ మార్కెట్ లో రైతులు, వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. వర్షాకాలంలో మట్టి చెరుకుతూ, ఎండాకాలంలో మంటలు మండుతూ వ్యాపారాలు నడిపే పరిస్థితి లేదు” అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ మార్కెట్‌కు 9 గ్రామాల నుండి రైతులు వస్తున్నారు. కానీ… కనీసంగా చెట్ట నీడ అయినా లేకుండా, రోడ్లు లేకుండా, వర్షం పడితే నీరు నిలిచిపోవడంతో, ప్రజలు వస్తువులు కొనడం తగ్గిస్తున్నారు.
గ్రామ పంచాయతీకి టాక్స్ లు చెల్లిస్తున్నా, ప్రభుత్వంచే ఎటువంటి శాశ్వత వసతులు కల్పించలేదని వ్యాపారస్తులు గళమెత్తుతున్నారు.
ఈ నేపథ్యంలో, మార్కెట్ కమిటీ చైర్మన్ కొరివి నర్సింహులు మాట్లాడుతూ – “ఈ మార్కెట్‌కి శాశ్వతంగా షెడ్లు, నీటి సదుపాయం, కరెంట్ సదుపాయం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఈ మార్కెట్ కి దుబ్బాక నుండి 10 కి.మీ, కామారెడ్డి నుండి 30 కి.మీ, సిద్ధిపేట నుండి 35 కి.మీ దూరాల నుండి వ్యాపారస్తులు వస్తున్నారు.
బట్టలు, జిలకర, కూరగాయలు వంటి ఎన్నో వస్తువులు ఈ మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. ప్రజలకు సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి, ఇది పెద్ద మార్కెట్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం” అన్నారు.
📢 చివరగా, రైతులు – “మాకు ఆదారం కావాలి, వాడుకోగలిగే వాతావరణం కావాలి” అంటూ ప్రభుత్వ దృష్టిని ఆకర్షిస్తున్నారు.