TEJA NEWS TV TELANGANA : కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండలంలో రిజర్వేషన్లు బీసీలకు అనుకూలంగా వస్తే, తాను బరిలోకి దిగేందుకు సిద్ధమని మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు తెలిపారు. 8వ తేదీ నాటికి స్పష్టత వస్తే, జెడ్పీ సర్పంచ్ స్థాయిలో అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాను గతంలో ఎంపీటీసీగా సేవలందించిన అనుభవం ఉన్నందున, ప్రజల ఆశీర్వాదమే తనకు ముఖ్యమని, ఏ పార్టీకి కాకుండా ప్రజల తీర్పును గౌరవిస్తానని చెప్పారు. “ప్రజలలో మనం ఉంటే, ప్రజలే మన పనులను చూసి తీర్పు ఇస్తారు. గతంలో ఇచ్చిన గెలుపు నాది కాదు, అది ప్రజల గెలుపు” అని పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులకు పేరుపేరునా నమస్కరిస్తూ, ప్రజల అండదండలతో సేవకునిగా ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఎన్నికల బోర్డు నిబంధనల కారణంగా ప్రెస్ మీట్ పెట్టలేకపోయినప్పటికీ, తన అభిప్రాయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు.
బిబిపేటలో బీసీలకు అవకాశముంటే బరిలోకి వస్తానన్న మాజీ ఎంపీటీసీ కొరివి నీరజ నర్సింలు
RELATED ARTICLES



