కామారెడ్డి జిల్లా బిబిపేట గ్రామంలో వరి పొలాలను సందర్శించడం జరిగింది. వరిలో కాండం తొలుచు పురుగును ( మోగి పురుగు) గమనించడం జరిగింది. వరి నాటిన 20 రోజుల లోపు కారటప్ హైడ్రో క్లోరైడ్ 4G గుళికలు ఎకరానికి 8కిలోల చొప్పున ఇసుకతో కలిపి వేసినచో మోగి పురుగును నియంత్రణ చేయవచ్చు. 20 రోజుల దాటిన వరికి నివారణ కు కార్టాఫ్ హైడ్రో క్లోరైడ్ 50% SP మందును ఎకరానికి 400 gr, లేదా క్లోరాంతనిలిప్రోల్ 60 ml లేదా టెట్రానిలిప్రోలు 100ml ఎకరానికి పిచికారి చేసినట్లయితే మోగి పురుగును నివారించవచ్చని సూచించారు. పొలాల గట్ల మీద కలుపు వల్ల మరియు అధిక యూరియా వాడకం వల్ల అగ్గి తెగులు కూడా కొన్ని చోట్ల ఆశించింది దాని నివారణకు ట్రీయసైక్లోజోల్ 120gr ఎకరానికి పిచికారీ చేయాలి. ఈ కార్యక్రమంలో AEO రాఘవేంద్ర మరియు బీబీపేట రైతులు పాల్గొన్నారు.
బిబిపెట్ గ్రామంలో రైతులకు సూచనలిచ్చిన AEO రాఘవేంద్ర
RELATED ARTICLES