Thursday, January 16, 2025

బిడ్డ అంగవైకల్యాన్ని ఎదుర్కొనే ఏకైక మార్గం రెండు పోలియో చుక్కలు



-పోలియో అంతం చేయడానిక కృషి చేద్దాం.
-బిడ్డ అంగవైకల్యాన్ని ఎదుర్కొని ఏకైక మార్గం.
-పోలియా రహిత సమాజాన్ని నిర్మిద్దాం.
-పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం.
-మండలంలో 98 శాతం నమెదు.
-లక్ష్యం7,634 గాను7,519 మళ్లీ లక్ష్యం సాధింపు.
-ఈ కార్యక్రమం తప్పినవారు 115 మంది చిన్నారులు గుర్తింపు.

కళ్యాణదుర్గం,కుందుర్పి, తేజ టీవీన్యూస్:

బిడ్డ అంగవైకల్యం ఎదుర్కొనే ఏకైక మార్గం రెండు పోలియో చుక్కలకు కలదని ,పల్స్ పోలియో కార్యక్రమాన్ని అంతం చేయడానికి మనమందరం సమిష్టిగా కృషి చేద్దామని కుందుర్పి గ్రామ సర్పంచ్,కె, మారుతిశ్వరి రామమూర్తి ప్రజలకు పిలుపునిచ్చారు.
ఆదివారం కుందుర్పి మండలంలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం లో భాగంగా. గ్రామాలలో వైద్యాధికారులు  అనూష ,చాంద్ బేగం , నారాయణస్వామి,  సోమేష్ కుమార్ లు ఆధ్వర్యంలో మండలంలోని 36 గ్రామాలలో పోలియో చుక్కలు అందించే కార్యక్రమం ఆయ గ్రామ సర్పంచ్ లు చేత ప్రారంభించారు. ఈ క్రమంలోని కుందుర్పి గ్రామ సర్పంచ్  మారుతీశ్వరి , నిజవళ్ళి గ్రామ సర్పంచ్ జి, ప్రభాకర్, ఇతర ప్రజాప్రతినిధులు, కుందుర్పి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసినారు.  మండల వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, మారుతేశ్వరి రామమూర్తి మాట్లాడారు. 0-5 ఏళ్ల చిన్నారి పిల్లలకు రెండు చిక్కులు వేయించడం ద్వారా ఇది బిడ్డ అంగవైకల్యాన్ని ఎదుర్కొనే ఏకైక మార్గం అన్నారు. తద్వారా పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని సూచించారు. మన మండల వ్యాప్తంగా 7,634 చిన్నారి పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నది లక్ష్యం కాగా 7,500 పిల్లలు చుక్కలు వేయించుకున్నారని, మిగిలిన తప్పినవారు  115 మంది చిన్నారి పిల్లలకు పోలియో చుక్కలును పిల్లల తల్లిదండ్రులను పిల్లలకు వేయించుకోవాలని కోరారు.
. ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో 38 పోలియో కేంద్రాలలో, ఒక ట్రాన్సిట్ పోలియో కేంద్రం, ఒక మొబైల్ పోలియో కేంద్రం ద్వారా ఇప్పటివరకు మొత్తం 7,519 మంది చిన్నారులకు పోలియో చుక్కలును వేశాంని పేర్కొన్నారు. మండలం వ్యాప్తంగా చిన్నారులు పోలియో చుక్కలు మొత్తం 98% శాతం వినియోగించుకున్నారు.  ఈ కార్యక్రమం లోకమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ముంతాజ్ బేగం, పబ్లిక్ హెల్త్ నర్స్, శశికళ , ధర్మసిం, ఇతర ఆరోగ్య సిబ్బంది ,అంగన్వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. ఈ కార్యక్రమంనకు తోడ్పాటు అందించిన ప్రజాప్రతినిధులకు ,వైద్య ఆరోగ్యశాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 4న నుంచి రెండు రోజులపాటు ఇంటి ఇంటికి తిరిగి తప్పిపోయిన చిన్నారులు ఎవరైనా వున్నచో వారిని కూడా గుర్తించి వారందరికీ పోలియో చుక్కలు అందించే కార్యక్రమం చేపడుతున్నట్లు వైద్యాధికారులు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular