భారతీయ జనతా పార్టీ *వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్* మాట్లాడుతూ…..
వరంగల్ జిల్లా నర్సంపేట మండల రెవెన్యూ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరి సమస్యలకు నిలయంగా మారింది నర్సంపేట పట్టణంలోని నడిబొడ్డున ఈ ఎమ్మార్వో కార్యాలయం ఉంది దీన్ని 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కార్యాలయం పూర్తిగా శిథిలమై కూలిపోయే దీనస్థితికి వచ్చింది గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పై కప్పు నుంచి నీళ్లు కారడంతో రికార్డులు పూర్తిగా దంసమై కార్యాలయంలో వాన నీటితో నిండి ఉంది . గత ప్రభుత్వము అన్ని హంగులతో ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ రాష్ట్రంలో ఉండబడినటువంటి అందరూ శాసనసభ్యులు వాడుకుంటున్నప్పటికీ నర్సంపేట శాసనసభ్యుడు మాత్రము ఆ క్యాంప్ ఆఫీసును వదిలేసి ప్రజల కోసం నిర్మించబడినటువంటి ప్రభుత్వ విశ్రాంతి గృహము (గెస్ట్ హౌస్) ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గా మార్చుకొని ప్రభుత్వ సొమ్ము 60 లక్షల రూపాయలు దాని అంగు ఆర్భాటాల కోసం కేటాయించి దాన్ని నిర్మాణం చేసుకున్నాడు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వ ఎమ్మార్వో ఆఫీసులు మాత్రము గాలికి వదిలేసిండు దీని ద్వారా ప్రజలు మండలంలో ఉండబడినటువంటి ప్రజలు మండల ఆఫీసుకు రావాలంటే భయ పడుతున్నారు మండలంలో ఆఫీసులో ఉండబడినటువంటి అధికారులు కూడా ఎప్పుడు కూలి పోతుందో అనేటువంటి భయాందోళన గురవుతున్నారు ప్రజల అవసరాల కోసం దీన్ని నిర్మించాల్సింది పోయి ఎమ్మెల్యే కార్యాలయాన్ని నిర్మాణం చేసుకున్నాడు ఇప్పటికైనా కూడా ప్రజల అవసరాల కోసం తక్షణమే ఈ ప్రభుత్వ కార్యాలయాన్ని మంచి నిర్మాణం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది
ఇట్టి కార్యక్రమంలో….. భారతీయ జనతా పార్టీ నర్సంపేట పట్టణ అధ్యక్షులు శీలం రాంబాబు గౌడ్ బిజెపి నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి కొంపెల్లి రాజేందర్, గూడూరు సందీప్, కౌన్సిలర్ జుర్రు రాజు, వరంగల్ జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి పంజాల రాము, వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా కో కన్వీనర్ కూనమల్ల పృథ్వీరాజ్, ఉపాధ్యక్షులు వల్లజీ నరేందర్, కార్యదర్శి ఠాకూర్ విజయ్ సింగ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సామల ప్రవీణ్ కుమార్, రాజ్ కుమారు, విక్రమ్ మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు
బిజెపి నాయకులు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం సందర్శన
RELATED ARTICLES