గత ఆరు సంవత్సరాలుగా బిఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పార్టీకి నా వంతు సేవలందించాను. దాని పలితం రెండు సంవత్సరాలు గంప గోవర్ధన్ గారి ఆశీర్వాదంతో బీబీపేట మండల రైతుబంధు సమితి అధ్యక్షునిగా కొనసాగడం జరిగింది. నన్ను నియమించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు, సహకరించిన జడ్పీవైస్ చైర్మన్ ప్రేమన్న కు, మండల బిఆర్ఎస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు మరియు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబుద్దిన్ కు తెలియజేయునది ఏమనగా
ప్రస్తుత పరిస్థితులు మాందాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన బిఆర్ఎస్ ముఖ్య నాయకుడి తీరు బాధాకరంగా ఉంది. నేరుగా మన పార్టీ వాళ్లే మాటల దాడి చేయకుండా కొందరిని ఉసగొల్పి విమర్శలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు . బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేనే బిఆర్ఎస్ పార్టీ అని బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన నేనే అన్న చందంగా వున్న ఆయన తీరు ఇప్పటికీ అలాగే ఉండడం ఆయన తీరు మారకపోవడం బాధాకరం… కావున బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఇట్లు.. అంకన్నగారి నాగరాజ్ గౌడ్ మాజీ మండల రైతుబంధు సమితి అధ్యక్షులు బీబీపేట్.