ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని అలాగే మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై మరియు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై నాయకులపై పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని సంగెం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పసునూరి సారంగపాణి అన్నారు.బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వణుకు దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను వదిలి బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడం సిగ్గుచేటని సీఎం కనుసన్నల్లో సాగుతున్న ఈ అక్రమ విధానాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని. నిర్భందాలు అరెస్టులు ఆంక్షలు బిఆర్ఎస్ పార్టీకి కొత్తకాదని అరెస్టులకు బెదిరేది లేదని అధికారం ఎవరికీ శాశ్వతం కాదని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదని అన్నారు. ఈ సందర్భంగా సంగెం ఎస్ఐ ఎల్, నరేష్ మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తగా వారిని అరెస్టు చేశామని తెలిపారు, అరెస్టు అయిన వారిలో పరకాల నియోజకవర్గ జాగృతి అద్యక్షుడు మునుకుంట్ల చంద్రశేఖర్, సంగెం మాజీ సర్పంచ్ గుండేటి బాబు,ఉప సర్పంచ్ కక్కెర్ల శరత్ బాబు,మండల నాయకులు మెట్టుపెల్లి కొమురయ్య,కత్తి రమేష్, వేల్పుల ఆంజనేయులు,సంగెం మండల యూత్ అద్యక్షుడు పెండ్లి పురుషోత్తం రెడ్డి,ఎలుగూర్ రంగంపేట ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సుమన్ తదితరులు ఉన్నారు.