TEJA NEWS TV TELANGANA:
*రాజు కొడుకు 4, 5 తరగతి చదువులకు పూర్తి బాధ్యత
*29 వేలతో రెండు సంవత్సరాలు కుటుంబానికి హెల్త్ పాలసీ సర్టిఫికెట్
మెదక్ జిల్లా. చేగుంట గ్రామానికి చెందిన భాసం రాజుశెట్టి అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న తన చిన్ననాటి స్నేహితులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తమవంతుగా రెండు లక్షల రూపాయల బ్యాంక్ బాండు పత్రాలను మరియు రెండు సంవత్సరాలకు సంబంధించిన హెల్త్ పాలసీ కి 29 వేల రూపాయలు, రాజు కూతురు చదువు కోసం 4,5తరగతి లకు ఫీజు పూర్తి బాధ్యత తీసుకుంటామని రాజు స్నేహితులు తెలిపారు. తన మధ్యలో ఉన్న రాజు అకాల మరణం తమను ఎంతో బాధ కలిగించిందని అతని కుటుంబానికి అండగా ఉండాలని ఉద్దేశంతో 1991-92 స్నేహితులందరం కలిసి తమ వంతు సహాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి, దాసోజి కృష్ణ, గడ్డమీది సిద్ధిరాములు, చాకలి శంకర్, అయిత అరవింద్, చందా రమేష్, తడుపునూరి మహేష్, పాల వేణు, గందె ప్రశాంత్, ఏఎన్ఎం నాగమణి, కూన సంతోష్, కాచం పూర్ణచందర్, కిరాణం సిద్ధిరాములు, గీతాంజలి సిద్ధిరాములు, లుక్క సంతోష్, బిక్షపతి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
బాసం రాజుశెట్టి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల బ్యాంకు బాండ్స్ అందజేసిన స్నేహితులు
RELATED ARTICLES



