Friday, December 12, 2025

బాలల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి

రిపోర్టర్ పి.శ్రీధర్
సెంటర్ ఆళ్లగడ్డ


నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో  శుక్రవారం నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలలో  సీనియర్ సివిల్ జడ్జి శైలజ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికలకు చట్టాలపై అవగాహన  కల్పించారు. అలాగే బాలికలకు గుడ్ టచ్, మరియు బ్యాడ్ టచ్  గురించి,  సమాజంలో జరిగే నేరాలపై అవగాహన కల్పించారు. నేటి బాలలే రేపటి పౌరులని పండిట్ జవహర్లాల్ నెహ్రూ సందేశాన్ని వినిపించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివరామిరెడ్డి మాట్లాడుతూ  విద్యార్థులు ట్రాఫిక్  రూల్స్ పై కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ షాహినా బేగం, న్యాయవాదులు గణేష్, సుబ్బారెడ్డి రమాదేవి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular