వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మోట్లంపల్లి గ్రామానికి చెందిన బోయ కిందికేరి నాగేష్ ఆగస్టు 4వ వ తేదీన తన యొక్క పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మోటార్ సైకిల్ పై తన యొక్క మొబైల్ ఫోన్ పోగొట్టుకోవడం జరిగింది. వెంటనే స్థానిక ఆత్మకూర్ పోలీసుల సహాయంతో సీఈఐఆర్ నూతన పోర్టల్ లో అప్లై చేయగా ఆత్మకూర్ సబ్ ఇన్స్పెక్టర్ నరేందర్ ఆధ్వర్యంలో సిఈఐఆర్ పోర్టల్ ద్వారా బాధ్యతని ఫోన్ ని సోమవారం రోజు ఆత్మకూర్ పోలీసులు ట్రస్ట్ చేసి రికవరీ చేసి బాధితునికి ఎస్పై నరేందర్ మొబైల్ ఫోన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నరేందర్ మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా తమ సెల్ ఫోన్ ని ఎవరైనా దొంగలించినా లేదా పోగొట్టుకున్నట్లయితే వారు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా అట్టి నెంబర్ను https://www.ceir.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందుపరచాలని అలా చేసినట్లయితే త్వరగా వారి మొబైల్స్ ని పట్టుకోవడం జరుగుతుందని కావున ప్రజలు సి ఐ ఆర్ నూతన అప్లికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.