TEJA NEWS TV TELANGANA:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో అన్నదమ్ముళ్లు మామిండ్ల నాగయ్య, మామిండ్ల రాములు చిన్న చిన్న విబేదాలతో 10 ఏళ్ల కింద విడిపోయారు
ఒకే గ్రామంలో ఉన్నా అన్నదమ్ముళ్లు మాట్లాడుకోవడం లేదని, ఇద్దరిని ఎలా అయినా కలపాలని నాగయ్య కుమారుడు శ్రీనివాస్ ఎన్నో సార్లు ప్రయత్నించి విఫలమయ్యడు
ఇదిలా ఉండగా నాలుగు రోజుల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో నాగయ్య, రామయ్యల మేనల్లుడు కూన తిరుపతి మరణించగా.. మూడు రోజుల కార్యానికి అన్నడమ్ముళ్లు ఇద్దరు హాజరయ్యారు
ఈక్రమంలో ఇద్దరిని కలపాలని శ్రీనివాస్.. వారి పాత రోజులను, జ్ఞాపకాలను గుర్తు చేయడంతో ఇద్దరు కన్నీరు పెట్టుకున్నారు
ఆరు పదుల వయసులో, కాటికి వెళ్లే ముందు పంతాలు ఎందుకని ఇకనుండి అయినా కలిసి బ్రతుకుదామని, యోగక్షేమలు అడిగి తెలుసుకొని ఆలింగనం చేసుకొని కంట తడి పెట్టుకున్నారు
బలగం సినిమా రిపీట్..60 ఏళ్ల వయసులో పంతాలు విడిచి మాట్లాడుకున్న అన్నదమ్ముళ్లు
RELATED ARTICLES