కర్నూలు జిల్లా ఆలూరు తాలుక్ హొళగుంద మండలం
బన్నీ ఉత్సవాలకు సర్వం సిద్ధం
- 100 Night vision సిసి కెమెరాలు, 600 LED లైట్లు, డ్రోన్ కెమెరా, విడియో కెమెరాల నిఘాలో బన్ని ఉత్సవం.
- బన్ని ఉత్సవానికి 1000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత.
- బన్ని ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చే చిన్న పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి.
- సంప్రదాయాన్ని గౌరవిస్తాం… పోలీసు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన కఠినచర్యలు. దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 24 (మంగళవారం) వ తేది రాత్రి జిల్లాలో ప్రతిష్టాత్మకంగా జరిగే దేవరగట్టు శ్రీ మాలమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవం ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టిందని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బన్ని ఉత్సవానికి 1000 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.
ఇందులో అడిషనల్ ఎస్పీ ఒకరు , 9 మంది డిఎస్పీలు, 29 మంది సిఐలు, 66 మంది ఎస్సైలు, 155 మంది ఎఎస్సైలు మరియు హెడ్ కానిస్టేబుళ్ళు,