నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. వీధిలో ఆడుకుంటున్న సమయంలో చిన్నారి మధుప్రియ (4)పై వీధి కుక్కలు దాడి చేసి ప్రాణాలు తీశాయి. తీవ్ర గాయాలతో మధుప్రియను స్థానికులు ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
చిన్నారిని వదిలిపెట్టకుండా గుంపుగా వచ్చిన వీధి కుక్కలు కరవడం గమనించి స్థానికులు మృత్యుంజయ పోరాటం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.
ఈ సంఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు వీధి కుక్కల నియంత్రణపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడుతున్నారు. అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బనగానపల్లెలో వీధి కుక్కల దాడి… నాలుగేళ్ల చిన్నారి మృతి
RELATED ARTICLES



