TEJA NEWS TV Telangana: కామారెడ్డి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మరియు జిల్లా ముఖ్య కార్య నిర్వహణ అధికారి కామారెడ్డి జిల్లా గౌరవ శ్రీ చందర్ నాయక్ గారు బిబిపేట్ మండలంలోని మాందాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను మరియు నర్సరీ పరిశీలించి అలాగే ఈరోజు ఫ్రైడే డ్రై డే కావున వాటర్ కింగ్ నిర్వహించడం కూడా జరిగింది. అలాగే మండల కార్యాలయంలో సందర్శించి కార్యాలయ సిబ్బంది మరియు ఉపాధి హామీ సిబ్బంది మరియు ఐకెపిఎం మరియు సీసీలతో మీటింగ్ నిర్వహించడం జరిగింది ఇట్టి మీటింగ్ లో అందరూ సకాలంలో హాజరై ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ పథకాలను అందిస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడగలరు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలను ఎక్కువగా పెంచి వారిని ఉదయం 10 గంటల లోపు వచ్చి వారి నిర్ణీత పనిని పూర్తి చేసుకొని వెళ్లవలసిందిగా చెప్పడం జరిగింది అలాగే వారికి తగిన 300 రూపాయలు వచ్చే విధంగా చూడాలని మరియు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున అక్కడ టెంటు మరియు వాటర్స్ ఫెసిలిటీస్ ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు మరియు మెడికల్ కిట్లు పని ప్రదేశంలో ఉంచవలసిందిగా చెప్పడం జరిగింది వేసవికాలం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రతి గ్రామంలో చలివేంద్రం మరియు నీటి వృధా పోకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎక్కడ వృధా పోయిన అక్కడ నిర్మూలిస్తూ వాటర్ పోకుండా నిర్మూలిస్తూ వాటర్ ను సేవ్ చేసే విధంగా చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ పూర్ణ చంద్రోదయ కుమార్ గారు మరియు ఏపీఎం మరియు ఏపీవో,కార్యాలయ సిబ్బంది అలాగే పంచాయతీ కార్యదర్శులు మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొనడం జరిగింది.