భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
మాల సోదరులారా మీ వాటా, మీ ఉపకులాల వాటా ఎంతో చెప్పండి
కొత్తగూడెం()రుద్రంపూర్:- ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రుద్రంపూర్ డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహం దగ్గర మాదిగ జే.ఏ.సి.సింగరేణి ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు కొండేటి షడ్రక్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర జనరల్ సెక్రటరీ మోదుగు జోగారావు ముఖ్య అధితిగా మాట్లాడుతూ డా.పిడమర్తి.రవి నాయకత్వంలో యస్.సి.వర్గీకరణలో మాదిగలకు 12% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ,ఫిబ్రవరి 2న ఉస్మానియా యూనివర్సిటీలో జరుగు విద్యార్థి యువ గర్జనను జయప్రదం చేయాలని కోరినారు.లక్ష డప్పులు,వెయ్యి గొంతులు కాదు,వర్గీకరణలో మాదిగ వాటా 12% మే ముద్దని అన్నారు.మాల సోదరులు మీ వాటా కోసం హక్కుగా అడగండి కానీ,వ్యతిరేకించి సమాజానికి దూరం కావద్దుని హితవు పలికినారు.వర్గీకరణ ప్రజా ఉద్యమం కాకముందే ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకొని డిమాండ్ చేసినారు.ఈ సమావేశంలో మాదిగ జే.ఏ.సి.విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు నరాల.రాజేష్,అంకుష్,మధు,యాకయ్య,సంజీవ రావు,కుమార్,కృష్ణ,అశోక్,ప్రసాద్,వెంకటస్వామి,పణి తదితరులు పాలుగోన్నారు*
ఫిబ్రవరి 2న మాదిగ జే.ఏ.సీ ఆధ్వర్యంలో విద్యార్థి యువగర్జన జయప్రదం చేయండి
RELATED ARTICLES