-అప్పన్న హస్తం కోసం ఎదురుచూపులు…
-వైద్య చికిత్స కోసం రూ, 10 లక్షలు వ్యయం అవసరం.
-ఆందోళనలో మహిళ కుటుంబ సభ్యులు.
-ఇప్పటికే రూ, రెండు లక్షలు ఖర్చు చేసిన నయనం కానీ వైనం.
-పేదరికం కారణంగా వైద్యం చేయించలేమన్న బాధితులు.
-ఈనెల16 ఆమెకు ఆపరేషన్ చేస్తామన్న వైద్యులు.
-తలలో చెడు రక్తం గడ్డ కట్టి….
కళ్యాణదుర్గం,కుందుర్పి, తేజ టీవీన్యూస్:
ప్రాణాంతకరమైన వ్యాధితో ఓ మహిళ అనునిత్యం నరకయాతనతో సతమతం పడుతుంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు బాధితురాల భర్త బోయ ,పారిజాత రాంబాబు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండల కేంద్రమైన కుందుర్పి గ్రామానికి చెందిన బోయ సామాజిక వర్గానికి చెందిన పారిజాతమ్మ వయసు 27 సంవత్సరాలు, భర్త, రాంబాబుకు ముగ్గురు చిన్నారి పిల్లల కలరు.ఇమెది పొద్దున్నే మైదార్లపల్లి, మెట్టినిల్లు కొందరికి గ్రామం. వీరు వ్యవసాయం పై ఆధారపడి జీవించేవారు.ఈ క్రమంలోనే పేదరికం భారిన పడి ఆ కుటుంబం మగ్గుతుంది. ఈ పారిజాతమ్మకు తలలో చెడు రక్తం గడ్డ కట్టి తీవ్ర తలనొప్పి, తల భారం, కళ్ల మంటతో నిత్య కృత్యంగా నరకయాతనతో బాధపడుతుంది. ప్రస్తుతం ఆమె కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పట్టణంలో సైంట్ జాన్ ఆసుపత్రిలో చికిత్స పొందడానికి పోయి వచ్చారు. ప్రస్తుతం మాయదారుల పల్లెలో కలదని బాధితురాలు భర్త రాంబాబు విలేకరితో బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకు మునుపు బెంగళూరు పట్టణంలో మెరుగైన వైద్య చికిత్స కోసం నిమన్స్, విక్టోరియా, ఎమ్మెస్, రామయ్య తదితర ఆసుపత్రిలో చికిత్స చేయించిన ఆమెకు నయనం కాలేదన్నారు. ప్రస్తుతం వైద్య చికిత్స కోసం చేతుల్లో చిల్లి గవిలేక , ఇతరులతో అప్పు చేద్దామన్న అప్పులు పుట్టకపోగా , తమకు దిక్కుతోచకగా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని అన్నారు. తద్వారా అపన్న హస్తం కోసం వేయి కళ్ళతో సహాయం కోసం నిత్య కృత్యం ఎదురు చూపులతో సాయం కోసం ఎవరైనా చేస్తారని చూస్తున్నారు బాధితులు. ఈ వ్యాధి భారీనా పడిన పారిజాతమ్మ కోసం ఆపరేషన్ చేయించడానికి సుమారు రూ,7 లక్షల నుండిరూ, 10 లక్షలు దాక ఖర్చు అవుతుందని వైద్యాధికారి నివేదిక ఇచ్చినట్టు బాధిత కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం తెలిసింది. ఈనెల 16వ తేదీన బెంగళూరు ఆసుపత్రికి రావాలని వైద్యులు చెప్పగా, రెండు మూడు రోజులు తర్వాత ఆపరేషన్ చేస్తామని వైద్యులు సూచించినట్టు చెప్పారు. ఇది చికిత్స చేయకపోతే అసలు ప్రాణానికే ముప్పు ఉందని వైద్యులు సూచించినట్టు తెలిసింది. అసలే పేదరికం కాగా ఇతరులతో వడ్డీకి అప్పుచేసి దాదాపు రూ, రెండు లక్షలు మెరుగైన వైద్యం చేయించిన నయనం కాలేదని వివరించారు. ఎఫెట్ సెల్ఫ్ సిసెడ్ ఆన్ రైమ్ వ్యాధుల సోకినట్టు అక్కడి వైద్యాధికారులు గుర్తించారు. ఆమె అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్న పారిజాతమ్మకు ఆర్థిక సాయం చేయదలచిన మానవత్వంకల దాతలు ఫోన్ పే నెంబర్ 82 47 03 3175 కు సహాయం చేయాలని బాధితులు మీడియాతో విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా మానవతా దృక్పథం కలిగిన వాదులు,కానీ స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ వెంటనే స్పందించి ఆర్థిక సహాయం చేసి ఆమె ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది.
ప్రాణాంతకమైన వ్యాధితో… నరకయాతనతో సతమతమవుతున్న మహిళ
RELATED ARTICLES



